వెయ్యి రోజుల ప్రజా పాలనపై కాంగ్రెస్ సంబరాలు
హుజురాబాద్, సెప్టెంబర్ 4 (చైతన్యగళం): కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజా పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌బాబు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్‌రావు ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొని ప్రభుత్వ ప్రజా పాలనను కొనియాడారు. అనంతరం పటాకులు కాల్చి, కేక్ కట్ చేసి వెయ్యి రోజుల ప్రజా పాలన విజయోత్సవాలను...