సంత్‌ రవిదాస్‌ చిత్రపటంపై నల్లరంగు.. చర్యలు తీసుకోవాలి

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడిని ఖండిస్తూ హుజురాబాద్‌లో నిరసన సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం హుజురాబాద్‌, ఆగస్టు 4 (చైతన్యగళం): గురు సంత్‌ రవిదాస్‌ చిత్రపటంపై నల్లరంగు పూయడం కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని హుజురాబాద్‌ బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు అన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్‌ శ్రేణుల దాడిని, సంత్‌ రవిదాస్‌ చిత్రపటంపై నల్లరంగు పూయడాన్ని ఖండిస్తూ గురువారం హుజురాబాద్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి...