22ఏ జాబితా నుంచి 6 వేల ఎకరాలను తొలగించాలి

రేకుర్తిలో బీఆర్‌ఎస్‌ రాస్తారోకో.. భూబాధితులు, రైతులతో కలిసి నిరసన ప్రభుత్వం స్పందించకుంటే అసెంబ్లీలో నిలదీస్తాం: గంగుల కమలాకర్‌ కరీంనగర్‌, సెప్టెంబరు 4(చైతన్యగళం): కరీంనగర్‌ జిల్లాలోని రేకుర్తి, సీతారాంపూర్‌, కొత్తపల్లి, చింతకుంట ప్రాంతాల్లో సుమారు 6 వేల ఎకరాల భూములను రిజిస్ట్రేషన్‌ చట్టంలోని 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రేకుర్తి చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. భూబాధితులు, రైతులతో కలిసి చేపట్టిన ఈ నిరసనలో మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పాల్గొన్నారు. తొలుత అంబేడ్కర్‌...