భక్తులతో కిక్కిరిసిన తిరుమల – సర్వదర్శనానికి 14 గంటలు
తిరుమల, సెప్టెంబర్ 3 (చైతన్య గళం): తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెప్టెంబర్ 4న గోకులాష్టమి ఆస్థానం, సెప్టెంబర్ 5న ఉట్లోత్సవం వేడుకలు జరగనున్న నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోగా, వెలుపల కూడా భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని ఉచిత సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం కోసం సుమారు 14 గంటలకు పైగా సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ...