52 ఎకరాల ప్రభుత్వ భూమి పంచారన్న వార్తలు అవాస్తవం
సిద్దిపేట, సెప్టెంబర్ 3 (చైతన్య గళం): గజ్వేల్ మండలం హవాయిగూడ గ్రామంలోని సర్వే నంబర్ 49 భూమికి సంబంధించి ఈనాడు, నమస్తే తెలంగాణ పత్రికల్లో ప్రచురితమైన వార్తలు వాస్తవ దూరంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పష్టం చేసింది. 52 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇతరులకు పంచినట్లు, అసైన్‌మెంట్ భూమిని పట్టా భూమిగా మార్చినట్లు వచ్చిన కథనాలు పూర్తిగా కల్పితమని పేర్కొంది సర్వే నంబర్ 49లో మొత్తం 83.04 గుంటల భూమి ఉండగా, 1959-60 పహాణీ ప్రకారం 31.27 గుంటలు ప్రభుత్వ భూమి (గైరాన్),...