సురేఖపై వేటుకు హైకమాండ్‌ గ్రీన్‌సిగ్నల్‌!

రాజీనామాకు అంగీకరించకపోవడంతో బర్తరఫ్‌కు సీఎం సిఫారసు.. చిన్నారెడ్డిపైనా వేటు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3(చైతన్యగళం): తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కొండా సురేఖ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. రాజీనామా చేసేందుకు సురేఖ అంగీకరించకపోవడంతో.. ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధిష్ఠానం నుంచి ఆమోదం లభించిన అనంతరం.. సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాకు సిఫారసు లేఖ పంపినట్లు సమాచారం....