గంజాయి స్వాధీనం,ఒకరి అరెస్ట్
కరీంనగర్ , సెప్టెంబర్ 3(చైతన్య గళం) కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామ శివారులోని సమ్మక్క గద్దెల సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేయగా.. మరో నిందితుడు పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు పోలీసుల వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్‌రెడ్డి, ఎస్‌ఐ ఏ. లక్ష్మారెడ్డి సిబ్బందితో కలిసి బుధవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఇరుకుల్ల...