CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 8:27 am Posted by : rakeshkashaveni12@gmail.com

ఓటర్ల సందేహాలు నివృత్తి చేసిన కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 3 (చైతన్య గళం):

నగరపాలక సంస్థ పరిధిలోని కళాభారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్‌ నోటీసుల కౌంటర్లను మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ బుధవారం పరిశీలించారు. కౌంటర్లలో జరుగుతున్న నోటీసుల పరిష్కార ప్రక్రియతో పాటు ఆన్‌లైన్‌లో వివరాల నమోదు విధానాన్ని పరిశీలించారు. బీఎల్‌ఓలతో మాట్లాడి హియరింగ్‌ ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు కేంద్రాలకు వచ్చిన ఓటర్లతో నేరుగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఓటర్ల వివరాల సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని బీఎల్‌ఓలకు సూచించారు. నోటీసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా నోటీసులు అందని ఓటర్లకు వెంటనే అందజేయాలని, హియరింగ్‌కు హాజరుకాని వారికి మరోసారి సమాచారం అందించి ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఆయాజ్‌, సువార్త, డిప్యూటీ కమిషనర్లు ఖాదర్‌ మొహియుద్దీన్‌, వేణుమాధవ్‌, ఎమ్మార్వో రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.