CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 8:25 pm Posted by : CHAITHANYA GALAM NEWS

హనుమాన్‌ దేవాలయంలో ప్రత్యేక పూజలు

  • హనుమాన్‌ దేవాలయంలో ప్రత్యేక పూజలు

యాచారం, సెప్టెంబర్‌ 1 (చైతన్యగళం): యాచారం మండలంలోని పెరుమాండ్ల ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పీఆర్‌జీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు ప్రొద్దుటూరి రవీందర్‌గుప్త తన తండ్రి ప్రొద్దుటూరి వెంకన్నగుప్త జ్ఞాపకార్థం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కొంగల శ్రీశైలం పూజా సామగ్రిని అందజేశారు. సరికొండ (పల్లెచెల్కతండా) మాజీ ఉపసర్పంచ్‌ వస్లావత్‌ నవీన్‌ నాయక్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. ఆలయ పైకప్పు రేకుల ఏర్పాటుకు భక్తుడు సంజీవ్‌ రూ.6 వేల విరాళాన్ని అందజేశారు.ఆలయ పూజారులు దశరథ్‌, నరియా నాయక్‌ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.కార్యక్రమంలో దకన, బాదు, జెంగు, పాప, జగన్‌, వస్లావత్‌ సాయిరాం, మెరావత్‌ గోపాల్‌, దేవికి తదితరులు పాల్గొన్నారు.