CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 8:02 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ఇంట్లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం

మానకొండూరు, సెప్టెంబర్ 1{చైతన్యగళం}:
మానకొండూరు మండల కేంద్రంలోని పోస్టాఫీసు సమీపంలో మంగళవారం ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎరుగురాల పోచయ్య ఇంట్లో ఈ ప్రమాదం సంభవించగా, ఇంట్లో అద్దెకు ఉంటున్న కే. శంకరమ్మ, కే. సునందు, కే. ఎల్లయ్య కుటుంబాలు సురక్షితంగా బయటపడ్డాయి ఇంట్లో నిర్లక్ష్యంగా వదిలిన మంట కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలిసింది. సమాచారం అందుకున్న మానకొండూరు అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదంలో గృహోపకరణాలు దెబ్బతిన్నట్లు సమాచారం. ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.