వృద్ధులు, దివ్యాంగులకు మెరుగైన వసతులు
కరీంనగర్, సెప్టెంబరు 1 (చైతన్య గళం): వృద్ధులు, దివ్యాంగులకు అన్ని విధాలా మెరుగైన వసతులు కల్పించి, వసతిగృహాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. మంగళవారం కార్ఖానాగడ్డలోని ప్రభుత్వ వృద్ధులు, దివ్యాంగుల వసతిగృహాన్ని ఆమె సందర్శించారు. అక్కడి వృద్ధులు, దివ్యాంగులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. వసతిగృహంలో అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు ఇప్పటికే చేపట్టిన ఆధునీకరణ పనులను పరిశీలించిన కలెక్టర్.. పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు...