విద్యుత్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
స్మారక స్థూపాన్ని ప్రారంభించిన టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి కరీంనగర్, ఆగస్టు 31 (చైతన్య గళం): ప్రజలకు నిరంతర విద్యుత్ సేవలు అందించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగుల త్యాగాలు చిరస్మరణీయమని తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అమరవీరుల స్మారక స్థూపాన్ని సోమవారం రాత్రి ఆయన ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సంస్థ కోసం, ప్రజలకు నిరంతర విద్యుత్ సేవలు అందించేందుకు విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు...