విముక్తి జాతుల సంక్షేమానికి పెద్దపీట

కరీంనగర్, ఆగస్టు 31 (చైతన్య గళం): విముక్తి జాతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్తి జాతుల దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో అణచివేతకు గురైన సంచార, అర్ధసంచార జాతులకు 1952 ఆగస్టు 31న విముక్తి లభించిందని తెలిపారు. సంచార, అర్ధసంచార జాతుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి...