ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటు: హరీశ్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 31(చైతన్యగళం): రాష్ట్రంలో ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుక్కుగూడలో నర్స్ హత్య ఘటనపై ఆయన సోమవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. గురుకులంలో చదివి, పేదరికాన్ని జయించి నర్సుగా సేవలందిస్తున్న ఆడబిడ్డ దారుణ హత్యకు గురికావడం తీవ్రంగా కలచివేసిందన్నారు. హత్య అనంతరం అత్యాచారం జరిగినట్లు వస్తున్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని, శాంతిభద్రతలు క్షీణించాయని హరీశ్‌రావు ఆరోపించారు. ప్రజల ఆస్తులకే...