కరీంనగర్, ఆగస్టు 31 (చైతన్య గళం):
కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలం నిబద్ధతతో సేవలందించిన ఇద్దరు పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మాన కార్యక్రమం సోమవారం కరీంనగర్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఏఎస్సై ఖాజా ఫయాజుద్దీన్, కరీంనగర్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ ఖాజా పాషా పదవీ విరమణ పొందారు కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం ముఖ్య అతిథిగా హాజరై పదవీ విరమణ పొందిన అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అనేక సవాళ్లతో కూడుకున్న పోలీసు విధులను నిబద్ధతతో, విజయవంతంగా పూర్తి చేసి పదవీ విరమణ పొందడం గొప్ప విషయమని అభినందించారు. పోలీసు అధికారులు విధుల్లో సమర్థవంతంగా పనిచేయడంలో వారి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు పదవీ విరమణ అనంతరం అధికారులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని సీపీ సూచించారు. అనంతరం పదవీ విరమణ పొందిన ఇద్దరు అధికారులకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. జ్ఞాపికలను అందజేసి వారి భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ సృజన్‌రెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (సంక్షేమం) కిరణ్‌కుమార్, కరీంనగర్ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ. సతీష్, కార్యదర్శి ఎస్సై నరసింహారావు, ఉపాధ్యక్షుడు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు ఎస్సై మామిడి సురేందర్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.