నీట్-పీజీ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత
పెద్దపల్లి, ఆగస్టు 30 (చైతన్య గళం): పెద్దపల్లి పట్టణంలో ఆదివారం నిర్వహించిన నీట్-పీజీ 2026 పరీక్షల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దపల్లి డీసీపీతో కలిసి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన, పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి జోన్ పరిధిలో మూడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్దకల్వలలోని మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల, బండారికుంట సమీపంలోని ట్రినిటీ...