ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

కరీంనగర్ టౌన్, ఆగస్టు 29 (చైతన్యగళం): భారత దిగ్గజ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బురుగుపెల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి, శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. వేడుకల్లో...