ప్రశాంతంగా మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపు

కరీంనగర్, ఆగస్టు 26 (చైతన్యగళం): మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం కరీంనగర్‌లో నిర్వహించిన ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కరీంనగర్ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం తెలిపారు స్థానిక పోలీసు అధికారులతో కలిసి సీపీ గౌష్‌ ఆలం భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. నాఖా చౌరస్తా, తెలంగాణ చౌక్‌ వద్ద ముస్లిం మత పెద్దలను పూలమాలలతో సత్కరించి మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలిపారు....