రాజన్న గోశాలలో ఐదు కోడెల మృతి

వేములవాడ, ఆగస్టు 25 (చైతన్య గళం): వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన తిప్పాపురం గోశాలలో ఐదు కోడెలు మృతి చెందడం కలకలం రేపింది. గోశాలలో సామర్థ్యానికి మించి కోడెలు ఉండటంతో నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. అపరిశుభ్రత, ఈగలు, దోమల సమస్యతో పాటు కోడెలకు అందుతున్న వైద్య సేవలు కూడా పరిమితంగా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి కోడెల మృతిపై విశ్వహిందూ పరిషత్ గోరక్ష విభాగం గోశాల సంపర్క ప్రముఖ్ వూట్కూరి రాధాకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ అధికారుల అలసత్వం కారణంగానే...