ఫీజు బకాయిలపై బీజేపీ పోరుబాట
కరీంనగర్ , ఆగస్టు 25 (చైతన్య గళం): విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్‌లో చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు కరీంనగర్ జిల్లా బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో పలువురు నాయకులు హైదరాబాద్‌కు తరలివెళ్లి దీక్షలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి వీడి...