మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టాలి

కరీంనగర్, ఆగస్టు 25 (చైతన్య గళం): మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నియంత్రణ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వసతి గృహాల్లో తరచూ తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖ ప్రత్యేక...