ప్రాజెక్టుల భూసేకరణకు అడ్డంకులు తొలగించాలి

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశం సిద్దిపేట, ఆగస్టు 25 (చైతన్యగళం): సాగునీటి ప్రాజెక్టుల కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన భూ యజమానులకు పరిహారం త్వరగా అందించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతులు, పెండింగ్‌ సమస్యలపై జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.     భూసేకరణ పరిహారం కోసం ఈ ఏడాది ప్రభుత్వం రూ.6 వేల కోట్ల నిధులు...