లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు – కలెక్టర్ హెచ్చరిక
సిద్దిపేట, ఆగస్టు 24 (చైతన్యగళం): గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కే. హైమావతి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో లింగ నిర్ధారణ నిషేధ చట్టం, వైద్య సంస్థల చట్టంపై జిల్లా సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాల నిర్వహణపై వివరాలు అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్కానింగ్, రోగ నిర్ధారణ కేంద్రాల యాజమాన్యాలు గర్భస్థ...