ఉద్యోగుల మహాధర్నాకు సన్నాహాలు

ఈ నెల 27న కలెక్టరేట్‌ ఎదుట భారీ నిరసన.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తరలిరావాలి కరీంనగర్, ఆగస్టు 24 (చైతన్యగళం): దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అధికారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన్‌, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. టీఎన్జీవో కమ్యూనిటీ భవన్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ...