ఈ నెల 27న గ్రామ, వార్డు సభలు

సిద్దిపేట, ఆగస్టు 24 (చైతన్యగళం): ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ, వార్డు సభల్లో ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు గైర్హాజరు, వలస, మరణించిన ఓటర్ల జాబితాలను బూత్‌ స్థాయి అధికారులు,...