మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా భద్రతపై డీఐజీ సమీక్ష

కరీంనగర్, ఆగస్టు 24 (చైతన్యగళం): మిలాద్‌ ఉన్‌ నబీ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని జోన్‌-3 డీఐజీ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జోన్‌-3 పరిధిలోని పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. పండుగ సందర్భంగా మతపరమైన కార్యక్రమాలు, ఊరేగింపులు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలతో సమన్వయం చేసుకుంటూ శాంతిభద్రతలకు విఘాతం...