ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయంలో సీపీ వార్షిక తనిఖీ
కరీంనగర్, ఆగస్టు 24 (చైతన్యగళం): నగరంలోని ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ సోమవారం వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ నిర్వహణ, వివిధ విభాగాల పనితీరు, సిబ్బంది విధుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులు, రిజిస్టర్లు, కేసుల వివరాలు, ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించిన పత్రాలను పరిశీలించిన సీపీ అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ట్రాఫిక్ సమస్యలు, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి...