ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీది మొసలి కన్నీరు – మంత్రి పొన్నం

చిగురుమామిడి, ఆగస్టు 24 (చైతన్య గళం): బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత ఆ పార్టీలో లొల్లులు ఎక్కువయ్యాయని, తన ఉనికిని కాపాడుకునేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. చిగురుమామిడి మండలం నవాబుపేటలో నిర్వహించిన ‘పల్లె పల్లెకు పొన్నం అన్న.. పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణపై బీజేపీ నేతలకు నిజంగా...