ఆకాశమే హద్దుగా.. అంతరిక్షంలో భారత దూకుడు
చంద్రయాన్-3 విజయ స్ఫూర్తితో మరిన్ని లక్ష్యాల వైపు భారత అంతరిక్ష చరిత్రలో ఆగస్టు 23 ఓ సువర్ణాక్షరం. దేశ శాస్త్రవేత్తల ప్రతిభ, పట్టుదల, అంకితభావానికి ప్రతీకగా నిలిచిన చంద్రయాన్-3 విజయాన్ని స్మరించుకునే ఈ రోజు యావత్ భారతదేశానికి గర్వకారణం. 2023 ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ తన సత్తాను చాటింది. ఈ చారిత్రక విజయానికి గుర్తుగా కేంద్ర...