డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
గూడూరులో వెయ్యి మందికి పైగా విద్యార్థులతో 2కే రన్ జెండా ఊపి ప్రారంభించిన ఎస్పీ డా. శబరీష్ పి., ఐపీఎస్ — డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని యువతకు పిలుపు గూడూరు, ఆగస్టు 22(చైతన్యగళం): డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గూడూరు మండల కేంద్రంలో ‘మన ఊరు–మన బాధ్యత’ 2కే రన్–ఫర్ డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక పాఠశాలలు, కళాశాలలకు చెందిన వెయ్యి మందికి పైగా విద్యార్థులు, యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు....