సెంట్రింగ్ కార్మికుడి అనుమానాస్పద మృతి

కరీంనగర్, ఆగస్టు 23 (చైతన్యగళం):    సెంట్రింగ్ పనులు చేస్తూ అనారోగ్యానికి గురైన కూన ఆంజనేయులు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై కరీంనగర్ రూరల్ పోలీసులు ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఆరేపల్లి గ్రామానికి చెందిన కూన శైలజ ఫిర్యాదు మేరకు.. ఆమె భర్త ఆంజనేయులు సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ...