కొర్రీలు లేకుండా వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేయాలి: సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్ సారధి రెడ్డి
మహబూబాబాద్(చైతన్యగళం): కొత్తగా చేయూత పథకం ద్వారా పెన్షన్ల మంజూరుకు దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో 57 సంవత్సరాలు నిండిన వృద్ధులను కూడా పథకంలో చేర్చి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం ప్రజాపాలనలో 57 సంవత్సరాలు నిండిన వృద్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పెన్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా,...