రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు
పెద్దపల్లి, ఆగస్టు 23(చైతన్యగళం): మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని మర్కజ్ మిలాద్ కమిటీ, పెద్దపల్లి ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని ఎం.బి. గార్డెన్స్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలను ఆయన అభినందించి, ప్రశంసాపత్రాలను అందజేశారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని, యువత స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో...