CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 9:51 pm Posted by : rakeshkashaveni12@gmail.com

గుర్తుతెలియని వాహనం ఢీ కొని దంపతులు మృతి

కరీంనగర్ , ఆగస్టు 23 (చైతన్యగళం): గుర్తుతెలియని వాహనం ఢీకొని దంపతులు మృతి చెందిన విషాద ఘటన చెంజర్ల ప్రాంతంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ 6వ డివిజన్‌కు చెందిన భూస శంకరయ్య (50), ఆయన భార్య జమున (45) కేశవపట్నం మండలం నిజాయితీగూడెంలో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా రాత్రి 8 గంటల సమయంలో చెంజర్ల వద్ద ప్రమాదానికి గురయ్యారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.