అక్రమ ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లు పట్టివేత
కరీంనగర్ , ఆగస్టు 22 (చైతన్యగళం): అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో మానకొండూరు మండలం శ్రీనివాస్‌నగర్‌కు చెందిన వరికుప్పల రాజశేఖర్, తన యజమాని వరికుప్పల తిరుపతి ఆదేశాల మేరకు మానేరు వాగు నుంచి ఇసుకను తరలిస్తుండగా గుంటూరుపల్లి స్టేజీ, బొమ్మకల్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అదే విధంగా మానకొండూరు మండలం లింగాపూర్‌కు చెందిన గాలిపల్లి గణేష్, తన యజమాని పిట్టల కృష్ణ ఆదేశాల మేరకు ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా...