పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషి చేయాలి
కరీంనగర్, ఆగస్టు 22 (చైతన్య గళం): పోలీసు సిబ్బంది సంక్షేమానికి నూతనంగా ఎన్నికైన జిల్లా పోలీసు సంఘం కార్యవర్గం కృషి చేయాలని కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు ఏ. సతీష్, కార్యవర్గ సభ్యులు శైలజ, ఎం.డి. అఫ్జల్ తదితరులు శనివారం కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో సీఐని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను సీఐ శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం సంఘానికి...