పాలకులకు భజన చేయడం దేశభక్తి కాదు.. వైఫల్యాలను ప్రశ్నించడమే నిజమైన దేశభక్తి
ప్రభుత్వ విధానాలను నిలదీయడం ప్రతి పౌరుడి హక్కు యువత, విద్యార్థులు సంఘటితమై ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమించాలి: ఐసా అధ్యక్షురాలు నేహా బోరా అమరావతి, ఆగస్టు 20 (చైతన్యగళం): దేశభక్తి అంటే పాలకులను పొగడటం, ప్రభుత్వాల తప్పులను గుడ్డిగా సమర్థించడం కాదని.. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధానాలను, ప్రభుత్వ వైఫల్యాలను నిర్భయంగా ప్రశ్నించడమే నిజమైన దేశభక్తి అని ఐసా అధ్యక్షురాలు నేహా బోరా అన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని లామాకాన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దేశ యువత, విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ...