చదువుల తొలి మెట్టు.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయమే విద్యార్థి భవిష్యత్తుకు బాట

మొదటి గురువు అమ్మ.. రెండో గురువు నాన్న.. మూడో గురువు ఉపాధ్యాయుడు.. విద్యార్థి జీవితం ఒక విత్తనం వంటిది. ఆ విత్తనం మొక్కగా, మహావృక్షంగా ఎదగడానికి మంచి నేల, నీరు, ఎరువు, సూర్యకాంతి ఎంత అవసరమో, ఒక విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి కుటుంబం, పాఠశాల, సమాజం అందించే సహకారం కూడా అంతే అవసరం. విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కేవలం పాఠశాలలు, ఉపాధ్యాయుల కృషి మాత్రమే సరిపోదు. తల్లిదండ్రుల బాధ్యత కూడా అత్యంత కీలకమైనది. మొదటి గురువు అమ్మ బిడ్డకు ప్రపంచాన్ని పరిచయం చేసేది తల్లి. మాటలు...