చదువులమ్మ తోటలో కత్తుల సంస్కృతి.. బాధ్యత ఎవరిది?
పాఠశాల అంటే పుస్తకాల పరిమళం వెదజల్లాలి. గురువు అంటే దిశానిర్దేశం చేసే దీపస్తంభంగా నిలవాలి. విద్యార్థి అంటే రేపటి సమాజానికి ఆశాకిరణంగా ఎదగాలి. కానీ నేడు పరిస్థితులు అందుకు భిన్నంగా మారుతున్నాయి. అక్షరాలు నేర్చుకోవాల్సిన చేతుల్లో ఆయుధాలు.. గురువును గౌరవించాల్సిన వయసులో హింస.. క్రమశిక్షణను నేర్పే ఉపాధ్యాయుడే తన ప్రాణాలకు భయపడే దుస్థితి! ఇది ఒక్క ఘటనకు సంబంధించిన ఆవేదన కాదు.. మన విద్యా వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను, సామాజిక బాధ్యతను ప్రశ్నిస్తున్న ప్రమాద ఘంటిక. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యోదంతం...