శిశుమందిర్‌ ఆచార్యులకు శ్రీనివాసరావు మార్గదర్శనం

కరీంనగర్ టౌన్, ఆగస్టు 20 (చైతన్యగళం): విద్యార్థుల్లో విద్యతోపాటు సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి వంటి విలువలను పెంపొందించేందుకు ఆచార్యులు అంకితభావంతో పనిచేయాలని ప్రాంత సంఘటనా కార్యదర్శి పథకమూరి శ్రీనివాసరావు సూచించారు. కరీంనగర్‌లోని శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో కరీంనగర్ సంకుల పరిధిలో శిక్షణ పూర్తి చేసుకున్న ఆచార్యులతో ఆయన సమావేశమై పలు అంశాలపై మార్గదర్శనం చేశారు. అనంతరం కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల పాఠశాలల ప్రధానాచార్యులు, ప్రబంధకారిణి సభ్యులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలల విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థుల సమగ్ర వికాసం, పాఠశాలల నిర్వహణ తదితర అంశాలపై...