CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 10:12 pm Posted by : CHAITHANYA GALAM NEWS

శిశుమందిర్‌ ఆచార్యులకు శ్రీనివాసరావు మార్గదర్శనం

కరీంనగర్ టౌన్, ఆగస్టు 20 (చైతన్యగళం): విద్యార్థుల్లో విద్యతోపాటు సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి వంటి విలువలను పెంపొందించేందుకు ఆచార్యులు అంకితభావంతో పనిచేయాలని ప్రాంత సంఘటనా కార్యదర్శి పథకమూరి శ్రీనివాసరావు సూచించారు. కరీంనగర్‌లోని శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో కరీంనగర్ సంకుల పరిధిలో శిక్షణ పూర్తి చేసుకున్న ఆచార్యులతో ఆయన సమావేశమై పలు అంశాలపై మార్గదర్శనం చేశారు.

అనంతరం కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల పాఠశాలల ప్రధానాచార్యులు, ప్రబంధకారిణి సభ్యులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలల విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థుల సమగ్ర వికాసం, పాఠశాలల నిర్వహణ తదితర అంశాలపై చర్చించి తగిన సూచనలు చేశారు. అనంతరం జిల్లా, విభాగ్ కార్యకారిణి సమావేశం నిర్వహించి సంస్థాగత కార్యక్రమాలపై సమీక్షించారు.

ఈ సమావేశాల్లో ప్రాంత సహ శైక్షణిక ప్రముఖ్ కడార్ల కుమార్, విభాగ్ అధ్యక్షులు ముక్కాల సీతారాములు, కార్యదర్శి మేచినేని దేవేందర్‌రావు, శైక్షణిక ప్రముఖ్ కాటం రవీందర్, కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల పాఠశాలల ప్రధానాచార్యులు పాల్గొన్నారు. కరీంనగర్ పాఠశాల కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, అప్పిడి వకుళాదేవి, కొత్తూరి ముకుందం, ప్రబంధకారిణి సభ్యులు హాజరయ్యారు.