తప్పిపోయిన మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు

కరీంనగర్‌ రూరల్‌, ఆగస్టు 20 (చైతన్యగళం): ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ మహిళను సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించి కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదం కారణంగా స్వస్థలం నుంచి బయటకు వచ్చిన ఆమెను పోలీసులు చేరదీసి, భద్రత కల్పించడంతో పాటు తల్లిదండ్రులకు సమాచారం అందించి సురక్షితంగా అప్పగించారు. ఈ నెల 3వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో కరీంనగర్‌ రూరల్‌ మండలం ఇరుకుల్ల గ్రామ శివారులో రాజీవ్‌ రహదారి పక్కన నూతనంగా నిర్మిస్తున్న వంతెన...