కరీంనగర్ సర్కిల్‌లో సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి పర్యటన.. అభివృద్ధి పనుల పరిశీలన
కరీంనగర్ టౌన్, ఆగస్టు 20 (చైతన్యగళం): విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కరీంనగర్ సర్కిల్‌లో పర్యటించి పలు విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నాణ్యత, వేగం, భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పర్యటనలో భాగంగా కొత్తగా నిర్మించనున్న హుజురాబాద్ డివిజన్ కార్యాలయాన్ని సీఎండీ...