రాజీవ్ గాంధీ ఆశయాలే స్ఫూర్తి- ఏఎంసీ వైస్ చెర్మన్ సాదుల పవన్ కుమార్
నంగునూరు, ఆగస్టు 20(చైతన్యగళం): భారత మాజీ ప్రధాని, దివంగత భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జయంతిని పురస్కరించుకుని నంగునూరు మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించారు. ఏఎంసీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్, ఎండీ. ఇమ్రాన్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయన దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు.భారతదేశ అభివృద్ధి, ఆధునిక భారత నిర్మాణం కోసం రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రగతికి దోహదపడ్డాయని సాదుల పవన్ కుమార్ పేర్కొన్నారు. నూతన సాంకేతికతను...