CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 3:49 pm Posted by : CHAITHANYA GALAM NEWS

రాజీవ్ గాంధీ ఆశయాలే స్ఫూర్తి- ఏఎంసీ వైస్ చెర్మన్ సాదుల పవన్ కుమార్

నంగునూరు, ఆగస్టు 20(చైతన్యగళం):

భారత మాజీ ప్రధాని, దివంగత భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జయంతిని పురస్కరించుకుని నంగునూరు మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించారు. ఏఎంసీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్, ఎండీ. ఇమ్రాన్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయన దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు.భారతదేశ అభివృద్ధి, ఆధునిక భారత నిర్మాణం కోసం రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రగతికి దోహదపడ్డాయని సాదుల పవన్ కుమార్ పేర్కొన్నారు.

నూతన సాంకేతికతను ప్రోత్సహిస్తూ భవిష్యత్ భారతదేశానికి బాటలు వేసిన దార్శనిక నాయకుడిగా రాజీవ్ గాంధీ నిలిచిపోయారని అన్నారు. కేవలం 40 ఏళ్ల వయసులోనే ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ రికార్డు సృష్టించారని గుర్తుచేశారు. యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు దేశాన్ని ఆధునికీకరణ దిశగా తీసుకెళ్లేందుకు ఆయన అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విప్లవం వేగంగా విస్తరిస్తున్న సమయంలో భారతదేశం కూడా ఆ మార్పులో ముందుండాలని రాజీవ్ గాంధీ ఆకాంక్షించారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ ఎండీ ఇమ్రాన్,గుట్టం రంగారెడ్డి,పాక్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు రవీంద్ర చారి, శివరాత్రి మైసయ్య, బీసీ సెల్ జిల్లా కోఆర్డినేటర్ బొల్లు సంజీవ్, సదానందం, బోజు రాములు, రాజు, మహేష్, భాను,సందీప్,స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.