ప్రతిపాదించిన స్థలంలోనే పల్లె దవాఖాన నిర్మించాలి

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి అవురుపల్లి గ్రామస్థుల వినతి మాడ్గుల, ఆగస్టు 20 (చైతన్యగళం): అవురుపల్లి గ్రామంలో పల్లె దవాఖాన నిర్మాణాన్ని గతంలో ప్రతిపాదించిన స్థలంలోనే చేపట్టాలని కోరుతూ గ్రామస్థులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామ సర్పంచ్ కిన్నెరి పెద్ద పోశయ్య ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన గ్రామస్థులు తమ సమస్యను వివరించారు. గత మూడేళ్ల క్రితం పల్లె దవాఖాన నిర్మాణానికి గ్రామపంచాయతీ కార్యాలయం వెనుక భాగంలోని స్థలాన్ని ప్రతిపాదించిన విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అదే స్థలంలో దవాఖాన...