కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలోకి: సుష్మితా పటేల్‌

రేవంత్‌ సోదరులపై సంచలన ఆరోపణలు.. పరకాల టికెట్‌పై సవాల్‌ వరంగల్‌(చైతన్యగళం): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పరకాల రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకపోతే పరకాల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్‌ సంచలన ప్రకటన చేశారు. పరకాల నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పరకాల నియోజకవర్గ రాజకీయాలపై సుష్మితా పటేల్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్‌రెడ్డి...