విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలి
ఇనుగుర్తి సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ ఆకస్మిక తనిఖీ ఇనుగుర్తి, ఆగస్టు 19(చైతన్యగళం): ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, వసతి గృహం, వంటగది, భోజనశాల తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఎమ్మెల్యే నేరుగా మాట్లాడి వారి చదువు, భోజనం, వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న...