కోటి వెంకటేశ్వర్లు హత్య కేసులో నిందితురాలు అరెస్ట్

హుస్నాబాద్, ఆగస్టు 18 (చైతన్య గళం): ఈ నెల 16న జరిగిన కోటి వెంకటేశ్వర్లు హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో నిందితురాలిగా ఉన్న కోటి రాజమణిని అరెస్ట్ చేసి విచారించినట్లు హుస్నాబాద్ సీఐ కె. శ్రీధర్ తెలిపారు. పోలీసుల విచారణలో రాజమణి తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు వెంకటేశ్వర్లుతో 35 ఏళ్ల క్రితం తనకు వివాహం జరిగిందని, వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని తెలిపింది. అయితే సుమారు 15 ఏళ్లుగా వెంకటేశ్వర్లు తనను, పిల్లలను దూరంగా ఉంచి మరో మహిళను...