ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు భారీ ఊరట
48 గంటల్లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని ఆదేశం.. వైద్య బోర్డు ఏర్పాటు జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను 48 గంటల్లోపు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందించాలని తాజాగా ఆదేశించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ బోర్డులో ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత వైద్యుడితో పాటు ఆయన సోదరి డా. ఉజ్మా ఖాన్‌ను సభ్యులుగా...